మెగా పవర్ స్టార్ రాం చరణ్ తన 15వ సినిమా శంకర్ డైరక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే.దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
సినిమాలో ఇప్పటికే చాలామంది స్టార్స్ నటిస్తుండగా లేటెస్ట్ గా మళయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది.తెలుగు సినిమాల్లో మోహన్ లాల్ నటించడం కొత్తేమి కాదు.
ఎన్.టి.ఆర్ తో ఆల్రెడీ జనతా గ్యారేజ్ చేసిన మోహన్ లాల్ చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో మనమంతా సినిమా కూడా చేశారు.ఇక ఇప్పుడు చరణ్ సినిమాలో కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.
సినిమాలో ఆయనది పవర్ ఫుల్ రోల్ అని టాక్.శంకర్ ఈ సినిమాని చాలా ప్రెస్టిజియస్ గా ప్లాన్ చేస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ తో అదరగొట్టిన చరణ్ తన నెక్స్ట్ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటాలని చూస్తున్నాడు.ఈ సినిమాతో చరణ్ కి నేషనల్ వైడ్ గా కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
ట్రిపుల్ ఆర్ తర్వాత శంకర్ సినిమా కూడా చరణ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లో భాగమని చెప్పొచ్చు.