నాగార్జున, మోహన్ రాజా.( Nagarjuna mohan raja ) ఈ కాంబినేషన్ పై ఎప్పటి నుంచో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఇద్దరి కాంబినేషన్ డిస్కషన్ ఇప్పటిది కాదు అని చెప్పవచ్చు.మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గాడ్ ఫాదర్ సినిమా( God Father ) మొదలు పెట్టక ముందు నుంచి డిస్కషన్ నడుస్తూనే ఉంది.
గాడ్ ఫాదర్ కోసం మోహన్ రాజాను స్వయంగా నాగార్జున, మెగా కాంపౌండ్ కు పంపించాడనే టాక్ కూడా అప్పట్లో నడిచింది.అయితే గాడ్ ఫాదర్ తర్వాత నాగార్జున సినిమాపై మోహన్ రాజా వర్క్ చేస్తాడని అంతా అనుకున్నారు.
నాగ్ వందవ సినిమాకు అతడే డైరక్టర్ అని ఫిక్స్ అయిపోయారు.

అయితే ఇప్పుడీ డిస్కషన్ నుంచి మోహన్ రాజా పేరు సైడ్ అయింది.తన వందో సినిమా కోసం ఒక తమిళ దర్శకుడితో నాగార్జున చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ కు చెందిన దర్శకుడు నవీన్,( Naveen ) నాగార్జునకు 2-3 స్టోరీలైన్స్ వినిపించాడట.
వీటిలో ఏదైనా ఓకే అయితే, నాగ్ వందో సినిమా అదే అవుతుంది.ఇంతకీ ఈ నవీన్ ఎవరు? ఇతడు కోలీవుడ్ టాప్ డైరక్టర్ కాదు.2013లో ఓ సినిమా తీశాడు.దానికి తనే నిర్మాత, దర్శకుడు రచయిత.
అందులో ఒక పాత్ర కూడా అతడే పోషించాడు.ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఆపై ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరో సినిమా తీశారు.ఈసారి డైరక్ట్ చేయలేదు.కేవలం కథ అందించి, ప్రొడ్యూస్ చేశాడు.
ఇప్పుడు నాగ్ తో చర్చలు జరుపుతున్నాడు.మధ్యలో విజయ్ ఆంటోనీతో సినిమా ఓకే చేసినప్పటికీ అది కూడా ఆగిపోయింది.
మరి మోహన్ రాజా ఏమయ్యాడు? నాగార్జున వందో సినిమాకు తను దర్శకత్వం వహించే అవకాశం లేదనే విషయాన్ని మోహన్ రాజా చాన్నాళ్ల కిందటే పరోక్షంగా వెల్లడించాడు.తమ్ముడు జయం రవిని హీరోగా పెట్టి అతడు థని ఒరువన్-2 సినిమా( Thani Oruvan ) ఎనౌన్స్ చేశాడు.
అప్పుడే చాలామందికి విషయం అర్థమైపోయింది.