భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కొత్త సిరీస్ నాణేలను మార్కెట్‌లోకి విడుదల చేశారు.కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐకానిక్ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ కొత్త సిరీస్ నాణేలను ఆవిష్కరించారు.
వీటి ప్రత్యేకత ఏమంటే, దృష్టి లోపం ఉన్న వ్యక్తులు సులభంగానే ఈ కాయిన్లను గుర్తు పట్టవచ్చు.ప్రత్యేక సిరీస్ తో రూ.1, రూ.2, రూ.5, రూ.10, రూ.20 నాణేలను విడుదల చేశారు.ఇక ఈ నాణేలు మార్కెట్‌లోకి కూడా చెలామణిలోకి రానున్నాయి.
ఈ నాణేలపై అకమ్ లోగో ఉండటం గమనార్హం.
అలాగే మోదీ క్రెడిట్ లింక్డ్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం జన్ సమర్థ్ పోర్టల్ అనే నేషనల్ పోర్టల్‌ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా లబ్ధిదారులు నేరుగా లెండర్లతో అనుసంధానమై ఉంటుంది.ఈ పోర్టల్ అందరికీ అర్ధమయ్యేలా సులభమైన రీతిలో ప్రభుత్వ ప్రయోజనాలను అందరికీ అందించడం ద్వారా వివిధ రంగాల సమగ్ర వృద్ధిని, అభివృద్ధిని ప్రోత్సహించడం జన్ సమర్థ్ పోర్టల్ ముఖ్య భూమిక పోషిస్తుంది.
ఈ పోర్టల్ అన్ని లింక్డ్ స్కీమ్‌ల ఎండ్ టు ఎండ్ కవరేజీని నిర్ధారిస్తుంది.

ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమంటే, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ మాత్రమే కాకుండా, రవీంద్రనాథ్ ఠాగూర్, ఏపీజే అబ్దుల్ కలాం బొమ్మలు కూడా రానున్న కాలంలో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. RBI, SPMCIL (సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా) 2 సపరేట్ సెట్లను IIT ఢిల్లీ ప్రొఫెసర్ దిలీప్ సహానికి పంపించడం జరిగింది.సహాని ఈ 2 సెట్లలో ఒకదాన్ని ఎంపిక చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు.
కాగా ప్రొఫెసర్ సహాని వాటర్‌మార్క్స్‌ను అధ్యయనం చేయడంలో నిపుణులు పద్మశ్రీని అందుకున్నారు.







