Rahul Gandhi PM Modi : కేసీఆర్-మోడీ ఒక్కరే.. ఎన్నికలప్పుడే డ్రామాలు: రాహుల్ గాంధీ

సీఎం కేసీఆర్-ప్రధాని మోడీ ఒక్కరేనని, మోడీ ఇచ్చే ఆదేశాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు.ఎన్నికల సమయంలోనే ఇద్దరూ కలిసి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.ప్రస్తుతం భారత్ జోడో యాత్ర హైదరాబాద్‌లో కొనసాగుతోంది.మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.టీఆర్ఎస్-బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

 Modi Kcr Dramas During Elections, Pm Modi, Cm Kcr, Dramas, Munugodu, By Election-TeluguStop.com

ప్రజల దృష్టిలో బీజేపీ-టీఆర్ఎస్ శత్రు పార్టీలుగా వ్యవహరిస్తారని, నిజానికి ఈ రెండు పార్టీలు ఒకటేనని రాహుల్ గాంధీ తెలిపారు.

ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని సూచించారు.కేంద్రంలో ప్రధాని మోడీ, తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రజల పాలనను మరిచారని, అభివృద్ధిని పట్టించుకోవడమే మరిచారని పేర్కొన్నారు.

కాలుష్యంలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే.తెలంగాణలో అవినీతి ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు.

కార్పొరేటర్ల చేతికి తాళం.

దేశంలో కార్పొరేటర్ల చేతికి కేంద్ర ప్రభుత్వం తాళాలిచ్చిందన్నారు.దేశంలోని ఎయిర్‌పోర్టులు, టెలికాం సంస్థలు, ఎల్‌ఐసీ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నారని, మోడీ తన స్నేహితులకు అప్పగిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.చిన్న పిల్లలకు పెట్టుబడులు కావాలంటే బ్యాంకులు ఇవ్వవని, కానీ మోడీ స్నేహితులకు మాత్రం ఎలాంటి హామీ లేకుండా రుణాలిస్తారని తెలిపారు.

వారందరూ మోడీకి అండగా ఉన్నారన్నారు.దేశాన్ని మోడీ దోచుకుంటే.

రాష్ట్రాన్ని కేసీఆర్ శాసిస్తున్నాడని పేర్కొన్నారు.కమీషన్లు ఇవ్వకుంటే ఎలాంటి ప్రాజెక్టులు ఓకే చెయ్యరన్నారు.

Telugu Cm Kcr, Congress, Dramas, Munugodu, Pm Modi, Rahul Gandhi-Politics

భారత్ జోడో యాత్రతో ప్రజలు సంతృప్తి.

భారత జోడో యాత్రతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు.పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు కలుస్తున్నారని, వారి వారి సమస్యలు తెలియజేస్తున్నారని చెప్పారు.తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, చిరు ఉద్యోగులుగా మారి స్విగ్గీ, జొమాటోలో పని చేస్తున్నారని అన్నారు.

దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయన్నారు.రైతులకు, నిరుద్యోగులకు అండగా కాంగ్రెస్ ఉంటుందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube