అలా చేస్తే మోడీకి మేలే.. నో డౌట్ క్లియర్ విన్ !

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ( BJP ) అధికారంలో ఉంది.2014 ఎన్నికల్లోనూ, 2019 ఎన్నికల్లోనూ దేశ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు.అయితే దేశ ప్రజలు రెండుసార్లు బీజేపీకే విజయాన్ని కట్టబెట్టడానికి చాలానే కారణాలు ఉన్నాయి.మోడీకి( Modi ) దేశవ్యాప్తంగా ఉన్న మేనియా, ఆయన పరిపాలనలో చూపిస్తున్న వైవిద్యం.

 Modi Clear Win If He Does That ,bjp , Congress , Narendra Modi ,trinamool Congre-TeluguStop.com

ఇలా చాలానే కారణాలు బీజేపీ విజయంకి కీలక పాత్ర పోషించాయి.అయితే ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన బీజేపీపై.

ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడడం ఖాయం.ఈ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకొని వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీకి అధికారం దూరం చేయాలని చూస్తున్నాయి విపక్ష పార్టీలు.

దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రతికూల పార్టీలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి మోడీని గద్దె దించాలని కంకణం కట్టుకున్నాయి.

Telugu Aam Aadmi, Congress, Mamata Banerjee, Narendra Modi, Rahul Gandhi-Politic

ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి కూడా.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ( Congress party )విపక్షలను కూడగట్టే పనిలో పూర్తిగా నిమగ్నం అయింది.విపక్ష కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని ఇప్పటికే హస్తం నేతలు ప్రకటించారు కూడా.

అయితే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కలిసిన నడిచేందుకు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు సిద్దంగా లేవు.విపక్షాల ఐక్య సారధిగా రాహుల్ గాంధీని( Rahul Gandhi ) అంగీకరించే ప్రసక్తే లేదని ఇటీవల మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.

ఇంకా ఆయా పార్టీల నేతల యొక్క అభిప్రాయం కూడా ఇదేనని జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

Telugu Aam Aadmi, Congress, Mamata Banerjee, Narendra Modi, Rahul Gandhi-Politic

దీంతో కాంగ్రెస్ ఆశిస్తున్న విపక్షాల కూటమి పగటికలే అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఒకవేళ విపక్షాలన్నీ ఒకే తాటిపైకి రాకపోతే… అది బీజేపీకి అనుకూలంగా మారుతుంది.ఎవరికివారు స్వతహాగా బరిలోకి దిగితే బారిగా ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరుస్తాయి.

దాంతో మళ్ళీ మోడీ అధికారం చేపట్టడం అనివార్యం అవుతుంది.అలా జరగకూడదంటే విపక్షాలపై కాంగ్రెస్ ఆదిపత్యం విరమించుకోవాల్సి ఉంటుంది.

అందుకు కాంగ్రెస్ సిద్దంగా ఉంటుందా అనే ప్రశ్నార్థకమే ? వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టాలని హస్తం పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఈ నేపథ్యంలో విపక్షాలను ఒకే తాటి పైకి తీసుకురావడంలో విఫలం అయితే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు నిరాశ తప్పదు.

మరోవైపు రాహుల్ నేతృత్వంలో నడిచేందుకు విపక్షాలు ససేమిరా అంటున్నాయి.ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో హస్తం పార్టీ తదుపరి ఏం చేయబోతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube