అనుమతుల కోసం దరఖాస్తు చేసిన మోడర్నా వ్యాక్సిన్..!

భారత్ లో మరో కరోనా వ్యాక్సిన్ రాబోతుంది.దేశంలో అమెరికా సంస్థ మోడర్నా తయారు చేసిన వ్యాక్సిన్ పై దరఖాస్తు చేసుకున్నారు.

డీసీజీఐ అనుమతుల కోసం అమెరికా సంస్థ మోడర్నా దరఖాస్తు చేసుకుందని అధికారులు చెబుతున్నారు.త్వరలోనే మోడర్నా ఎం.ఆర్.ఎన్.ఏ వ్యాక్సిన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి గ్రీన్ సిగ్నల్ రాబోతుందని చెబుతున్నారు.విదేశాల్లో అనుమతులు పొందిన ఈ వ్యాక్సిన్ ఇక్కడ బ్రిడ్జి ట్రయల్స్ అక్కర్లేదని ప్రభుత్వ నిబంధనలు పేర్కొంటూ మోడర్నా టీకాల దిగుమతికి అనుమతి ఇవ్వాలని సిప్లా దఖారస్తు లో పేర్కొంది.

భారత్ కు వ్యాక్సిన్లను కొవ్యాక్స్ ప్రొగ్రాం ద్వారా భారత్ కు సరఫరా చేస్తమన్ అమెరికా ప్రకటించినట్టు దఖాస్తులో తెలియచేసింది.త్వరలోనే ఫైజర్ వ్యాక్సిన్ భారత్ లోకి అందుబాటులోకి రానుంది.

భారత్ లో అనుమతులు తుది దశలో ఉన్నాయని సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ప్రకటించారు.ఇక ఇప్పటికే స్పుత్నిక్ వ్యాక్సిన్లకు భారత్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

రష్యా నుండి కొన్ని లక్షల డోసులు ఇండియాకు వచ్చాయి.  ఇండియాలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నాయి.

ప్రస్తుతం కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు