ఒక టైం లో రాజమౌళి ఫ్యామిలీ మొత్తాన్ని పోషించింది అతనే...

Mm Keeravani Who Took The Responsibility Of Rajamouli Family Detals, Rajamouli, Keeravani, Music Director Mm Keeravani, Rajamouli Family, Vijayendra Prasad, Valli, Director Rajamouli, Karthikeya, Rama Rajamouli

రాజమౌళి ఫ్యామిలీ అంటే సినిమా లవర్స్ అందరికి చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ల ఫ్యామిలీ మొత్తం సినిమాల్లోనే డిఫరెంట్ క్రాఫ్ట్ లో వర్క్ చేస్తూ ఉంటారు.రాజమౌళి కూడా తాను ఇంతా పెద్ద డైరెక్టర్ కావడానికి తన ఫామిలీ సపోర్ట్ చాలా ఉంది అని చెప్తాడు.

 Mm Keeravani Who Took The Responsibility Of Rajamouli Family Detals, Rajamouli,-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటె రాజమౌళి వాళ్ల నాన్న రైటర్ విజయేంద్రప్రసాద్,రాజమౌళి భార్య కాస్ట్యూమ్ డిజైనర్, అన్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ , రాజమౌళి వాళ్ల వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్ రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమా కి సంభందించిన అన్ని పనులు చూసుకుంటాడు ఇలా వాళ్ల ఫ్యామిలీ మొత్తానికి సినిమా అంటే ప్రాణం.అందుకే రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడుతూ హిట్స్ కొడుతూ ఉంటారు…

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వీళ్లు ఈ స్టేజ్ కి రాకముందు చాలా కష్టపడ్డారు అనే విషయం చాలా మంది కి తెలీదు కొన్నిసార్లు అయితే తినడానికి తిండి కూడా ఉండేది కాదట.ఆ టైం లో రాజమౌళి వాళ్ల నాన్న విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమాలు సరిగ్గా ఆడక పోవడంతో ఆయనకి ఆఫర్స్ లేక ఖాళీ గా ఉండేవారట కీరవాణి గారి ఫాదర్ శివ శక్తి దత్త గారు లిరిక్స్ రాసేవారు ఆయనకి కూడా వర్క్ లేక ఖాళీగా ఉండేవారు

Telugu Rajamouli, Karthikeya, Keeravani, Rama Rajamouli, Valli-Movie

అప్పుడు రాజమౌళి, కాంచి, కళ్యాణ్ మాలిక్, శ్రీలేఖ వీళ్ళందరూ చిన్నవాళ్ళే కావడం వల్ల స్కూల్ కి వెళ్తూ చదువుకునేవారు.వీళ్ళదంతా ఉమ్మడి కుటుంభం కావడంతో చిన్న పెద్ద అంత కలిసి ఒక 25 మంది ఉండేవారు.ఎవ్వరికి ఏ పని లేదు అలాంటి సందర్భంలో కీరవాణి ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా చేసి వచ్చిన డబ్బు తో కుటుంభం మొత్తాన్ని పోషించేవాడట తన భార్య వల్లి కూడా ఇంటి పెద్ద గా ఉండి చిన్నపిల్లలుగా ఉన్న రాజమౌళి వాళ్ల బ్రదర్స్ అందరికి ఏం వంటలు కావాలంటే అవి చేసి పెట్టెదట ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కూడా కసురుకోకుండా అన్ని పనులు చేసి పెట్టెదట…

Telugu Rajamouli, Karthikeya, Keeravani, Rama Rajamouli, Valli-Movie

ఈ క్రమంలో కీరవాణి దాదాపు ఒక 2 ,3 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించాడట అందుకే ఇప్పటికి రాజమౌళికి కీరవాణి అన్న, వల్లి గారు అన్న చాలా రెస్పెక్ట్ ఉంటుంది… ఆ ఒక్క విషయంలో వాళ్ళిద్దరిని మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని రాజమౌళి వాళ్ల గురించి చాలా గొప్పగా చెప్తాడు వల్లి గారు ఇదంతా నాకెందుకు మనం సెపరేట్ అయిపోదాం అనే ఒక్క మాట కీరవాణి తో అని ఉంటె అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదో కానీ ఆవిడా అలా అనలేదు అందరు నా వాళ్లే అనుకొని పని చేసింది…అందుకే ఇప్పటికి కూడా మేమంతా ఉమ్మడి కుటుంభంగానే ఉంటున్నాం అని రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు…

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube