బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.గతేడాది మార్చి 14న వేసిన పిటిషన్ ను కవిత తరపు న్యాయవాదులు విత్ డ్రా చేసుకున్నారని తెలుస్తోంది.
కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఆ పిటిషన్ నిరర్ధకంగా మారిందన్న లాయర్లు అందుకే విత్ డ్రా చేసుకున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కవిత లాయర్ విక్రమ్ చౌదరి పేర్కొన్నారు.కాగా ఈ పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమం అంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.







