ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై విచారణ చేస్తున్న ఈడీ అధికారులు తాజాగా అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించబడినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్లై అని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.తాను కవిత ప్రతినిధినని పిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చాడని అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్లై పనిచేశాడని ఈడీ చెబుతోంది.ఇండో స్పిరిట్ తో భాగస్వామ్యంలో పిళ్లైది కీలక పాత్ర లేదని పేర్కొంది.రూ.3.50 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు పిళ్లై చెప్పాడన్న ఈడీ ప్రతిఫలంగా కవిత ఆదేశాలతో పిళ్లైకి రూ.కోటి మేర ఇచ్చారని రిపోర్టులో పొందుపరిచారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలపై పిళ్లైని విచారించాలని ఈడీ వెల్లడించింది.