ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈనెల 24న విచారణకు రాబోతుందని తెలిపారని సమాచారం.
సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం విచారణకు హాజరవుతానని కవిత లేఖలో స్పష్టం చేశారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు వచ్చే వరకు విచారణ సరికాదని చెప్పారు.
సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని లేఖలో కోరారు.మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవచ్చా అనే అంశం కోర్టులో పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.
చట్ట సభ ప్రతినిధిగా, చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటానని వెల్లడించారు.