ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha)ను ఈడీ అధికారులు తొమ్మిదో రోజు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
అలాగే లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారాలపై కవిత వాంగ్మూలాలను ఈడీ నమోదు చేస్తుంది.కవిత వ్యాపారాలు, కుటుంబ సభ్యుల వ్యాపారాలతో పాటు లిఖిత పూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలను ఈడీ సేకరిస్తుంది.

దాంతోపాటుగా కవిత, సమీర్ మహేంద్రుకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టిన ఈడీ రూ.100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర మరియు సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలపై ఆరా తీస్తుంది.కాగా రేపటితో కవిత ఈడీ కస్టడీ ముగియనుంది.ఈ మేరకు రేపు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరచనుంది.







