ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scan ) కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.ఈ మేరకు మెజిస్ట్రేట్ నాగపాల్ బెంచ్ ముందు కవిత హాజరయ్యారు.
విచారణలో భాగగా కవిత( MLC Kavita )ను ఈడీ అధికారులు పది రోజుల కస్టడీకి కోరారు.కాగా కవిత తరపున విక్రమ్ చౌదరి, మోహిత్ రావు వాదనలు వినిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కవిత మెడికల్ అంశాలను విక్రమ్ చౌదరి ప్రస్తావించారు.మెడికల్ రిపోర్ట్స్ తమకు ఇవ్వలేదని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఈడీ కవితను అరెస్ట్ చేసిందన్న న్యాయవాదులు గతంలో కవిత కేసు విచారణకు సహకరించారని న్యాయస్థానానికి తెలిపారు.విచారణకు హాజరయ్యారు.

మొబైల్స్ సబ్మిట్ చేశారని చెప్పారు.నవంబర్ లో ఈడీ వినతి మేరకు సుప్రీంకోర్టు( Supreme Court )లో కేసు వాయిదా పడిందన్నారు.నవంబర్ 21న ఈడీ సమయం కోరిందన్న కవిత తరపు లాయర్లు ఇది పూర్తిగా తప్పుడు అరెస్ట్ అని పేర్కొన్నారు.ఈడీ గతంలో ఎటువంటి బలవంతపు చర్య తీసుకోమని హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే జనవరి 3న సమన్లు ఇవ్వగా.దానికి సమాధానం ఇచ్చామని తెలిపారు.
కేసు సుప్రీంకోర్టులో ఉన్నా ఈడీ అధికారులు అత్యుత్సాహం చూపారన్నారు.ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో చెప్పిన అన్ని విషయాలతో కలిపి అప్లికేషన్ దాఖలు చేస్తామని తెలిపారు.







