దళిత వర్గానికి చెందిన కారు డ్రైవర్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 211 రోజులు జైలు జీవితం గడిపిన అనంతబాబు బుధవారం రాత్రి జైలు నుంచి బయటకు వచ్చారు.
అనంత బాబుకు మద్దతుదారులు, అనుచరుల నుంచి ఘన స్వాగతం లభించింది. అనంతబాబు కారులో అడుగు పెట్టగానే ఆయనపైకి పూలరేకులు , పూలదండలు వేసేందుకు పోటి పడ్డారు.
జై బాబు.జై జై బాబు అంటూ అనంత బాబు అభిమానులు నినాదాలు చేశారు.
అభిమానుల అత్యుత్సాహాన్ని చూసిన అనంత బాబు చేతులెత్తి అభివాదం చేశారు.అయితే అనంత బాబుకు ఇంత పెద్దగా ఘనంగా స్వాగతం పలకడమేమిటి? అతను ఏమైనా ప్రజల కోసం జైలుకు వెళ్ళరా? అతను నేరస్థుడగా జైల్లో ప్రతి పక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. అనంత బాబు డ్రైవర్‌ను హత్య చేసినట్లు మౌఖిక , ఫోరెన్సిక్ ఆధారాలు ఉన్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు విచారణను జాప్యం చేసి, చార్జిషీట్ దాఖలు చేయడంలో విఫలమయ్యారని.
చివరకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందంటూ ప్రతి పక్షాల నాయకులు అంటున్నారు.
జగన్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైనప్పుడు జరిగిన ఘటనతో ప్రతిపక్ష నేతలు తమ ఏ1 నిందితులకు ఘన స్వాగతం పలకడం వైసీపీకి కొత్త కాదని అంటున్నారు. ఈ ఘన స్వాగతం మంచి సంకేతం కాకపోయినా నేరస్తులకు ముక్తకంఠంతో ఎర్ర తివాచీ పరి స్యాగతం పలకడమేంటని పలు ప్రజా సంఘలా నాయకులు కూడా ఆరోపిస్తుస్తున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇక అనంతబాబు తన డ్రైవర్‌ను హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అనంతబాబుకు సంబంధించిన కొన్ని రహస్య వ్వవహరాలు డ్రైవర్ తెలియడంతో అవి బయటకు రాకుండా ఇలా చేశాడనే ఆరోపణలు వినిస్తున్నాయి.