ఎంపీ సీటుపై రాజాసింగ్ కన్ను ? ఆ నియోజకవర్గంపై చూపు ?

తెలంగాణ బిజెపి లో ఎప్పుడూ తన విశిష్టతను చాటుకుంటూ ఉంటారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.కరుడుగట్టిన హిందూ భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

 Mla Rajasing Trying On Jahirabad Mp Seat , Mp Rajasing, Goshamahal Mp, Bjp, Cong-TeluguStop.com

ముఖ్యంగా గో అక్రమ రవాణాను అడ్డుకుంటూ, అసలు సిసలైన బిజెపి భావ జాలాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యే గా ఉన్న రాజసింగ్ రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నారట .ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే గా పనిచేయడంతో ఈసారి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీలో అడుగుపెట్టాలని, అక్కడ తన ప్రత్యేకతను చాటుకోవాలని రాజాసింగ్ ఉబలాట పడుతున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.దీనికి తగ్గట్లుగానే బీజేపీ అధిష్టానం సైతం తెలంగాణలో బలంగా ఉన్న నాయకులను ఈసారి పార్లమెంట్ కు పోటీ చేయించాలని చూస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలోనే తనకి తప్పకుండా ఎంపీ అభ్యర్థిత్వం దక్కుతుందని రాజాసింగ్ ఆశలు పెట్టుకున్నారట.రాబోయే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే విషయంపైనా.

గత కొంతకాలంగా ఆయన పరిశీలిస్తున్నారట.ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ లోక్ సభ స్థానాన్ని ఆయన ఎంపిక చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తాము అనే ధీమా ఉండడంతో ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారట.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సైతం రాజా సింగ్ సన్నిహితుడిగా ఉండడంతో తాను కోరిన సీటు దక్కుతుంది అనే నమ్మకంతో రాజాసింగ్ ఉన్నారట.

అందుకే తరుచుగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పర్యటిస్తూ … క్షేత్ర స్థాయిలో బలం పెంచుకునే విషయంపైనే రాజాసింగ్ దృష్టిపెట్టారట.ఈ నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలంగా యాక్టివ్ గా ఉంటూ.

రాబోయే ఎన్నికల నాటికి తమ కల నెరవేర్చుకునే పనిలో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube