కడియం శ్రీహరికి జై కొట్టిన రాజయ్య.. కారణం ఆయనేనా..?

బిఆర్ఎస్ (BRS) పార్టీలో ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాలు నిర్వహించాలని సాంకేతాలు జారీ చేశారు.ఇదే తరుణంలో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah) కు టికెట్టు కన్ఫామ్ చేయలేదు.

 Mla Rajaiah Who Supported Kadiyam Srihari Details, Brs, Kadiyam Srihari, Tatikon-TeluguStop.com

ఇదే స్థానంలో కడియం శ్రీహరి (Kadiyam Srihari) ని ఎమ్మెల్యే కండేట్ గా ప్రకటన చేశారు సీఎం కేసీఆర్.దీనికి ప్రధాన కారణం రాజయ్య పై జానకిపురం సర్పంచ్ నవ్య అనేక ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేసిందని చెప్పవచ్చు.

ఆమె ఆరోపణల వల్ల రాజయ్య కాస్త నియోజకవర్గంలో డల్ అయిపోయారని , పార్టీ పరువు పోతుందనే ఆలోచనతో అక్కడ సీటును కడియం శ్రీహరికి కేటాయించారు.

Telugu Brs, Brs Ticket, Kadiyam Srihari, Mlarajaiah, Ghanpur, Telangana-Politics

దీంతో అప్పటి నుంచి రాజయ్యకు మరియు కడియం శ్రీహరికి మధ్య వార్ మొదలైంది.అధిష్టానం శ్రీహరికి కేటాయించిన టికెట్ పై రాజయ్య నిరంతరం మాట్లాడుతూ నాకు పార్టీ పై నమ్మకం ఉందని,చివరి సమయంలో నాకే టికెట్ వస్తుందని రాజయ్య ప్రజల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రచారం నిర్వహించడం మనం చూశాం.ఈ క్రమంలో స్టేషన్ ఘన్ పూర్ (Station Ghanpur) లో ఇలాంటి పరిణామాలు ఏర్పడతాయని అందరూ భయపడ్డారు.

Telugu Brs, Brs Ticket, Kadiyam Srihari, Mlarajaiah, Ghanpur, Telangana-Politics

కానీ ప్రస్తుతం ఒక అనుకోని ట్విస్ట్ ఏర్పడింది.కడియం శ్రీహరికి వచ్చినటువంటి టికెట్టుకు తాటికొండ రాజయ్య మద్దతు ఇచ్చారు.వీరి మధ్య గొడవలు లేకుండా మంత్రి కేటీఆర్ (KTR) రంగంలోకి దిగి వారి గొడవను సెట్ చేశారు.ప్రగతిభవన్లో స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరియు కడియం శ్రీహరితో భేటీ అయ్యారు కేటీఆర్.

ఇద్దరికీ దిశా నిర్దేశం చేసి , కడియం శ్రీహరి (Kadiyam Srihari) కి పూర్తి మద్దతు తెలపాలని రాజయ్యను ఒప్పించారు.ఇక ఇద్దరు కలిసి పోయినట్టు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

మరి రాజయ్య నిజంగానే కడియం శ్రీహరికి మద్దతు తెలుపుతారా.లేకపోతే చివరి సమయంలో పార్టీ మారి ఏదైనా షాక్ ఇస్తారా అనేది ఎన్నికల నామినేషన్ల వరకు తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube