ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనిని భారత్ తీవ్రంగా ఖండించగా.
దౌత్యవేత్తను బహిష్కరించింది.అలాగే కెనడియన్లకు వీసాలను సైతం నిలిపివేసింది.
సిక్కులను మచ్చిక చేసుకునేందుకు, తన రాజకీయ స్వలాభం కోసం ట్రూడో తీసుకున్న నిర్ణయం అంతిమంగా ఆయనకే చేటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.భారత్‌పై చేసిన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి ట్రూడోకు ఎలాంటి మద్ధతు లభించడం లేదు.
చాలా దేశాలు తటస్థంగానే వుండిపోయాయి.అయితే సొంతదేశంలోనే ట్రూడో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
తాజాగా విడుదలైన ఓ పోల్ సర్వేలో జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) పాపులారిటీ దిగజారింది.
కెనడా కేంద్రంగా పనిచేసే గ్లోబల్ న్యూస్ కోసం చేసిన ఇప్సోస్ పోల్ ప్రకారం.ప్రజాదరణ విషయంలో ట్రూడో బాగా వెనుకబడిపోయారు.విపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్ పోయిలీవ్రే( Pierre Poilivre ).తదుపరి ప్రధాని కావాలని దాదాపు 40 శాతం మంది కెనడియన్లు ఆకాంక్షించారు.2025లో జరిగే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కన్జర్వేటివ్‌లకు మెజారిటీ స్థానాలు దక్కుతాయని గ్లోబల్ న్యూస్ నివేదించింది.మరోవైపు.ప్రధానిగా జస్టిన్ ట్రూడోకు 31 శాతం మద్ధతుగా నిలుస్తున్నారు.
ఖలిస్తాన్ సానుభూతిపరుడు, ట్రూడో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్డీపీ నేత, భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్( Jagmeet Singh ) నాలుగు పాయింట్లు కోల్పోయారు.ప్రధానిగా ఆయనకు 22 శాతం మంది మద్ధతు పలుకుతున్నారు.ఆర్ధిక వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, హౌసింగ్ వంటి అంశాల్లో కెనడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పోయిలీవ్రే అత్యుత్తమ ప్రణాళికలను కలిగి వున్నారని మెజారిటీ కెనడియన్లు భావిస్తున్నారు.ప్రస్తుతం భారత్‌పై జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో అన్ని వాస్తవాలు బయటకు రావాలని పోయిలీవ్రే పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కన్జర్వేటివ్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఇప్సోస్ సీఈవో డారెల్ బ్రికర్ అన్నారు.