పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఏ కార్యక్రమం చేపట్టిన వెరైటీగా ఉంటుంది కార్యక్రమం లో ప్రజా సేవ కూడా ఇమిడి ఉండడంతో ఆయన ఏ పని చేసినా ప్రజల మద్దతు లభిస్తుంది వర్షాలు కారణంగా వచ్చిన వరదలతో పాలకొల్లు నియోజకవర్గంలోని అనేక గ్రామాల ముంపు గురైయ్యాయి ఈ సందర్భంలోనే పశువులకు అవసరమైన గ్రాసం పూర్తిగా లేకుండా పోయింది.దింతో పగో జిల్లా ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో ఉన్న పచ్చి వెండి గడ్డి ని పాలకొల్లు నియోజకవర్గం లోని 14 లంక గ్రామాలకు ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు సహకారంతో రామానాయుడు తీసుకు వెళుతున్నారు.
పశువుల కోసం సేకరించిన పచ్చి గడ్డి ఎండి గడ్డి ను రోజు ట్రాక్టర్ తో ముంపు గ్రామాలకు అందిస్తున్నారు ఈ సందర్భంగా కలిగొట్ల గ్రామస్తులను నిమ్మల రామానాయుడు అభినందించారు మనకు కావలసిన నిత్యవసర సరుకులను కావలసిన ఏ దుకాణంలోనైనా సేకరించుకుంటాము కానీ మూగజీవాలకు గడ్డి అనేది దొరకక అల్లాడుతున్నాయని ఆకలితో ఉన్న జీవులను చూసి గ్రామస్తులు చలించి పశుగ్రాస పంపించేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని రామానాయుడు మరో ఎమ్మెల్యే రామరాజు అన్నారు .గత ఏడు రోజుల నుండి ప్రతిరోజు గడ్డి పంపిస్తున్నందుకు కలిగొట్ల గ్రామ ప్రజలకు రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు
.