MLA Kurasala Kannababu: సుప్రీం కోర్టు వ్యాఖ్యలతోనైనా టిడిపి జనసేన కళ్ళు తెరవాలి - ఎమ్మెల్యే కన్నబాబు

కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కామెంట్స్.శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోకుండా కొంతమంది స్వలాభం కోసం అమరావతి ని తెలుగు దేశం ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

 Mla Kurasala Kannababu Comments About Supreme Court Judgement On Amaravati Detai-TeluguStop.com

పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శాసన సభ ఆమోదంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి ఏదైతో చెబుతున్నారో దానిని ప్రతిపలించే విధంగా అంతర్లీనంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని స్వాగతిస్తున్నాం.

రాష్ట్ర హైకోర్టు టౌన్ ప్లానర్ పాత్రను ఎలా పోసిస్తుంది అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి సూటిగా అడిగారు.శాసన వ్యవస్థ లోకి న్యాయవ్యవస్థ చొరబడినట్లు మేము అప్పుడే చెప్పాం.

న్యాయ వ్యవస్థ పై మాకు గౌరవం ఉంది.సుప్రీంకోర్టు వ్యాఖ్యలు న్యాయానికి ధర్మానికి ఉన్న విలువగా మేం భావిస్తున్నాం.సుమారు 4700 ఎకరాలను చంద్రబాబు తమ సొంత మనుషులుతో కొనిపించి ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారు.ఇప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తో టిడిపి గాని జనసేన గాని కళ్ళు తెరుచుకోవాలని కోరుకుంటున్నాం.

రాజధాని ప్రాంతం లో పెదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తామంటే చివరకు కమ్యూనిస్టు పార్టీలు కూడా అడ్డుకోవడం దారుణం.జగన్మోహన్ రెడ్డి అమరావతి ని కొట్టుకుపోవడం వలనే రాష్ట్రంలో చిన్ని పిల్లలు తగ్గిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డే కారణం అని ఎల్లో మీడియాలో వార్తలు రాసారు మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలుతో ఏమంటారు.

చంద్రబాబు టక్కుటమార విన్యాసాలతో ఈ రాష్ట్రం ఇంకా ఎన్నాళ్ళు నష్టపోవాలి.చంద్రబాబు కి తన కొడుకు బాగుండాలి తన వాళ్ళు బాగుండాలి దాని కోసం ఎవరు నష్టపోయిన ఆయన కు అనవసరం.

సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో నైనా టిడిపి,జనసేన, కమ్యూనిస్టు నాయకులు తమ నకిళీ ఉద్యమాలను కట్టిపెడితే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది.రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు దీనిలో మోసం ఉందని గోలచేసి హడావిడి చేసిన వ్యక్తి ఈ రోజు వారితో ఎలా జతకట్టాడు.

మీరు తప్పులు చేయబట్టే కదా రాజధాని ప్రాంతం ప్రజలు మిమ్మల్ని ఓడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube