2ప్లస్ 2 గన్ మెన్లలో ఇద్దరిని వెనక్కి పిలిపించిన ప్రభుత్వం.మరో ఇద్దరు గన్ మెన్లు కూడా నాకొద్దని గౌరవప్రదంగా వెనక్కి ఇచ్చేస్తున్నానని ప్రకటన.
కన్నీళ్లు పెట్టుకున్న గన్ మెన్లు.రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కామెంట్స్.
మా బావ కాకాణిని 4 ప్రశ్నలు అడిగా… అది సమాధానం చెప్పకుండా 40 తిట్లు తిట్టారు.నాకు నలుగురు గన్ మెన్లని వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇచ్చింది.
ఇద్దరు గన్ మెన్లని వెనక్కి రమ్మని పిలిచారు, వాళ్లని సంతోషంగా పంపించా.గన్ మెన్లు వెనక్కి వెళ్లెప్పుడు వాళ్ళ బాధ చూసి ఆవేదన కలిగించింది.
నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి…నా భద్రతకు అదనపు రక్షణ ఇవ్వాలి.అధిపోయి సెక్యూరిటీ తగ్గించడం అంటే నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
ఇద్దరు గన్ మెన్లని తొలగించారు… మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నా.ఇప్పుడు ఉన్న ఇద్దరు గన్ మెన్లని మీకు గౌరవప్రదంగా తిరిగి పంపించేస్తున్నా.నాకు గన్ మెన్లు అవసరం లేదు, ఒక్కడినే తిరుగుతా.నన్ను ఏమైనా చేసుకోండి… భయపడను.
రోజు రోజుకు నా గొంతు పెరుగుతుంది కానీ… తగ్గదు.ప్రజా సమస్యలపై పోరాడుతా.
ప్రజలు, కార్యకర్తలు, నా శ్రేయోభిలాషులే నాకు రక్ష.ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా… రెండో ఆలోచనే లేదు… తగ్గేదేలే… 175కి 175 గెలుస్తాం అన్నారు గా… ఒక్క ఎమ్మెల్యే గొంతు తెరిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కో ఆర్డినెటర్లు, సోషల్ మీడియాలో టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి.
ఎంపీ రఘురామకృష్ణంరాజుకి జరిగిన దానికంటే ఎక్కువ నాకు జరుగుద్ది అని తెలుసు.దేనికైనా సిద్ధంగానే ఉన్నాను… ప్రజల వెంటే నడుస్తాను
.