తన ఫోను టాపింగ్ చేశారంటూ ఏపీ ప్రభుత్వం అధికార వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసమతి గళాన్ని విప్పిన నెల్లూరు గ్రామీణ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడియో టేప్ భాహిర్గతం అయ్యింది.నిన్న అనుచరులు మీడియా ప్రతినిధుల తో ఆఫ్ ది రికార్డులో పిచ్చాపాటిగా మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
ఆ ఆడియో రికార్డ్ ఇప్పుడు అధికార పార్టీని కలవరపెడుతోంది.కల్లోలం రేపుతోంది.
రాజకీయ వర్గాలలో కల్లోలం సృష్టిస్తోంది.నా ఫోన్లు టాప్ చేశారు… అక్టోబర్ నుంచి ఈ వ్యవహారం నడుస్తోంది డిసెంబర్ 23న

ఈ విషయం నాకు తెలిసింది… ఇదే విషయాన్ని బయట పెడితే ప్రభుత్వం గందరగోళం లో పడుతుంది.పాలకులపై చర్యలు తప్పవంటూ శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోంది. శ్రీధర్ రెడ్డి పిచ్చాపాటిగా మాట్లాడిన ఆడియో పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తోసిపుచ్చిన కొన్ని గంటల్లోనే శ్రీధర్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.రాష్ట్రస్థాయిలో అధికార పార్టీ లో కలకలం రేపుతోంది.అధికార పార్టీ నేతలతో పాటు ప్రతిపక్షంలోనూ ఈ టేప్ చర్చనీయాంశం అయింది.