మునుగోడు పర్యటనలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లో కార్యకర్త లతో తాను పార్టీ మారే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే ఏ పార్టీకైనా తాను సపోర్ట్ చేస్తానని అలాగే తనకు తన సొంత పార్టీ లో కూడా ఆదరణ కరువైంది అని తెలిపారు.
గౌరవం ఇవ్వని చోట ఉండలేను రాజగోపాల్ రెడ్డి తనకు గౌరవం ఇవ్వని చోట ఉండలేనని కాంగ్రెస్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎవరి కిందపడితే వారికి కింద పనిచేయలేనని చెప్పారు.ఈ మేరకు తగిన నివేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు.తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చనని వెల్లడించారు
.






