కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం: వంగవీటి వేడుకలను ఎమ్మెల్యే కొడాలి నాని ఘనంగా నిర్వహించారు.ఈరోజు మధ్యాహ్నం స్థానిక శరత్ థియేటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆశలను కొనసాగించాలని అన్నారు.
శాసనసభ్యునీ గా మూడు సంవత్సరాలు పదవిలో ఉండగా ఆయన హత్యకు గురికాబడ్డారని, కోస్తా జిల్లాల్లో వంగవీటి రంగా పేరు మరువలేనిదని, ఆయన పేరు మీద నేటి రాజకీయాలలో ప్రభుత్వాలలో మార్పులు కనిపిస్తున్నాయని ఆయన ఆశయాలను లక్ష్యాలను కొనసాగించాల్సిన బాధ్యత మనపై ఉందని నాని అన్నారు.