కాకినాడ జిల్లా: ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే, కాకినాడ.ఎమ్మెల్సీ అభ్యర్ధి కర్రి పద్మశ్రీకి బిజెపితో ఎలాంటి సంబంధం లేదు.
ఎన్నికల సమయంలో నాతరుపున నా భార్య చేసిన డోర్ టూ డోర్ క్యాంపెయిన్ లో కర్రి పద్మశ్రీ పాల్గోన్నారు.నా గెలుపు కోసం పద్మశ్రీ భర్త నారాయణ పార్టీలో పని చేశారు.
సామాజిక న్యాయం కోసమే పద్మశ్రీని ఎంపిక చేశాము.మట్టి దొంగ, డ్రావెల్ దొంగ చినరాజప్పే.
అలాంటి దొంగను పక్కన పెట్టుకుని చంద్రబాబు నాపై ఆరోపణలు చేశాడు.పోర్ట్ ద్వార పిడిఎస్ రైస్ ఎగుమతి అవుతుందని చంద్రబాబు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పకుంటాను.
లేదంటే లోకేష్ ను కాకినాడ నుండి పోటీ చేయించాలి.చంద్రబాబుకు సవాల్.రేషన్ పంపిణీ ద్వారా ఇప్పుడు పాత బియ్యం సరఫరా చేస్తున్నాము.వాటిని పేదలు అమ్ముకునే పరిస్ధితి లేదు.
గతంలో ఎమ్మెల్సీలు, రాజ్య సభ సీటు డబ్బుకున్న వాళ్ళకి ఇచ్చి పదవులను చంద్రబాబు అమ్ముకున్నాడు.చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే నా తండ్రి రైస్ మిల్లర్ల అధ్యక్షుడు గా పని చేశారు.
నా తమ్మున్ని రైస్ మిల్లర్లు అధ్యక్షుడుగా ఎన్నుకుంటే చంద్రబాబుకు ఎందుకు ఏడుపు.