తిరుమల శ్రీవారిని భేతి సుభాష్ రెడ్డి దర్శించుకున్నారు.మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భేతి సుభాష్ రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా,
ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… భారత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కేసీఆర్ కు శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, దేశ ప్రజలంతా తెలంగాణ సంక్షేమ పథకాల వైపు చూస్తున్నారని, భారత రాజకీయాలను కెసిఆర్ విజయవంతంగా ముందుకు నడపాలన్నారు.







