పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ గెలుపు ఖాయమని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్న ఆయన బీఆర్ఎస్( BRS ) అధికారంలో ఉన్నప్పుడే వర్షాలు తక్కువ పడ్డాయని చెప్పారు.
ఈ క్రమంలోనే నీటి ప్రణాళిక గురించి కేటీఆర్ కు( KTR ) తెలుసా అని ఆయన ప్రశ్నించారు.ఎంపీ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందన్నారు.
గతంలో బీఆర్ఎస్ సర్కార్ రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బీఆర్ఎస్ భయపడుతోందని పేర్కొన్నారు.మిషన్ భగీరథ( Mission Bhagiratha ) ఫాల్స్ స్కీమ్ అన్న మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ కు నిధులు రాకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.