పల్నాడు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, తూబాడు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ఏ విధంగా క్షేత్రస్థాయిలో అమలవుతుందో పరిశీలించడానికి వచ్చానని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఉదయం నుంచి 269 ఓపీలు చూడడం జరిగిందన్నారు.
ప్రజలు ఏ స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని వినియోగించుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తోందన్నారు.మన ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఉందని తెలుస్తుందన్నారు.ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా అనేక రకాల వైద్యానికి కావలసినటువంటి ఇన్విటేషన్ మరియు ఉచిత మందులు వెంటనే ఇవ్వడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా సమస్య ఏదైనా పెద్దది అయితే పై స్థాయి హాస్పిటల్కు రికమండ్ చేయడం జరుగుతుందన్నారు.జగనన్న ప్రభుత్వంలో ఈరోజు డాక్టర్ ఇంటికి వచ్చి వైద్యం చేయడం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రం కూడా సాహసం చేయలేదని అటువంటి సాహసం ప్రజల కోసం మన ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నారన్నారు.అంతేకాకుండా వైద్యుని చూడాలన్న హాస్పటల్ కు దేవుని చూడాలన్న ఏ గుడికో వెళ్ళాలి కానీ ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా నేరుగా డాక్టర్ మన ఇంటికి వచ్చి మన ఆరోగ్య విషయాలు తెలుసుకుంటున్నారంటే ఇంతకన్నా మహర్దశ ఇంకొకటి ఉండదన్నారు.
అటువంటి రోజు మన జగనన్న ప్రభుత్వంలో సాధ్యమైందని ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని మన ముఖ్యమంత్రి జగనన్న చిలకలూరిపేట నుంచే ప్రారంభించారని రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 90.000 వేల మంది ఈ సేవలు వినియోగించుకుంటున్నారన్నారు.రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యం ఎలా అందించాలో జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.చంద్రబాబు నాయుడు హయాంలో వైద్య రంగానికి ఏమి చేయలేదని చంద్రబాబు హయాంలో రాజధాని పేరుతో అమరావతిలో భూ కుంభ కోణాలు జరిగాయని రాష్ట్ర ప్రజల అందరికీ తెలుసని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.