హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హైదారాబాద్ లోని వారి నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలకు, నిజమాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలు తొలగి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజల శ్రేయస్సు కొరకు తలపెట్టిన ప్రతిపని అవిజ్ఞంగా, అంతరాయం కలగకుండా ముందుకు సాగాలని విఘ్నేశ్వరున్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని అన్నారు.







