తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ పార్టీ కారు టైర్లు పంచర్ అయ్యాయని ఎద్దేవా చేశారు.
గత కొన్ని రోజులుగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) హాస్యాస్పదంగా వ్యవహారిస్తోందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేటీఆర్( KTR ) సలహాలు సిల్లీగా ఉన్నాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరంపై మాజీ సీఎం కేసీఆర్( Former CM KCR ) దిగజారిన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.