పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్ రావు..

మెదక్ జిల్లా కేంద్రము లోని పిల్లి కోటాల్ అట్టహాసంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన రాష్ట్రఆర్ధిక,వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.పాల్గొన్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ హరిశ్ ,జడ్పి వైఎస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి అడిషనల్ కలెక్టర్లు ప్రతిమ సింగ్,రమేష్ ,మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్,వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ ,ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావ్ కు బోనాలు,బతుకమ్మ లు,డబ్బు చప్పుళ్ళు ,బ్యాండ్ మేళలా మధ్య స్వాగతం పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు సామూహికంగా గృహ ప్రవేశాలు చేసిన పేదలుజిల్లా కలెక్టర్ హరిశ్ కామెంట్స్ పారదర్శకంగా పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తున్నాం డ్రా పద్ధతిన ఎంపిక చేశాము మరో నెలల్లో రెండో విడతలో రానివారికి ఇస్తాం డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతాం

 Minister Tanniru Harish Rao Started Double Bedroom Houses For The Poor, Ministe-TeluguStop.com

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్

డబుల్ బెడ్రూం లతో పేదల కల నెరవేరుతుంది మెదక్ లో పండుగ వాతావరణం లో పేదలు పట్టాలు తీసుకుంటున్నారు గత ప్రభుత్వాలు పైరవీలు చేసిన ఇండ్లు ఇవ్వలే పేదలు ఆత్మగౌరవంగా బతకాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు.

ఆదిశగా ముందుకు సాగుతున్నాం జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ లో కూడా ఇంత బాగా ఇన్ఫ్రాట్రాక్షర్ కనపడదు.టిఆర్ఎస్ ప్రవేశ పెట్టె పథకాలు దేశంలో ఎక్కడా లేవు.

కొన్ని ప్రభుత్వాలు మన పథకాలు ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి.జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ త్వరలోనే వస్తున్నారు.

మెదక్ రూపురేఖలు మార్చింది టిఆర్ఎస్ సర్కారే భవిష్యత్ లోనూ టిఆర్ఎస్ అధికారంలోకి ఖాయం

ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కామెంట్స్ మెదక్ పట్టణానికి సీఎం కేసీఆర్ వెయ్యి ఇండ్లు మంజూరు చేశారు.ఈ రోజు ఐదు వందల ఇళ్లను ప్రారంభించుకున్నాం.

దసరా లోపు మరో ఐదు వందల ఇండ్లు ప్రారంభిస్తాం మీరందరూ ఎమ్మెల్యే గా గెలిపించినందుకు మీకు సేవ చేసే భాగ్యం కలిగింది.నా బిడ్డ పద్మ ను గెలిపించండి.

మీ మెదక్ ను జిల్లా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చారు.మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి లో దూసుకుపోతుంది.

ఎవ్వరిని నిరాశపర్చాను.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా.

నెలరోజుల్లో అసంపూర్తిగా ఉన్నా పనులను పూర్తి చేసి ఇస్తాం.దసరా రోజు మిగితా 500 ఇల్లు ఇస్తాం మెదక్ నియోజకవర్గ వర్గంలో చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి.

డబుల్ బెడ్రూం ఇళ్లలో సౌకర్యాల కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి ని రిక్వెస్ట్ చేస్తున్నా వచ్చే ఏడాది మెదక్ లో మెడికల్ కాలేజి మంజూరవుతుంది పేదల కళ్ళల్లో సంతోషమే మాకు ఎంతో తృప్తినిస్తుంది.మెదక్ లో రైతుల కోసం రైల్వే రెక్ పాయింట్ ను ఏర్పాటు చేశాం

మంత్రి తన్నీరు హరిశ్ రావ్ కామెంట్స్

మెదక్ లో ఈ రోజు 575 పేదలకు ఇళ్లలోకి పంపించాము కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రూ 60 వేలు ఇచ్చేటోళ్లు .అందులోనూ లీడర్లకు కమిషన్లు ఇవ్వాలి ఈ రోజు ఎవరైనా ఇల్లు కోసం లంచం ఇచ్చారా ఇల్లు కట్టి చూడు.పెండ్లి చేసి చూడు అనే సామెతను మార్చేశం దేశంలో ఎక్కడైనా బీజేపీ,కాంగ్రెస్ లు ఇండ్లు కట్టిచ్చినర కాంగ్రెస్ ,బీజేపీ లీడర్లు మాత్రం పెద్దపెద్ద ఇండ్లు కట్టుకున్నారు నెల రోజుల్లో అన్ని పూర్తిచేసి రెండో విడత 500 ఇండ్లలోకి పంపిస్తాం సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ 3 లక్షలు ఇస్తాం కాంగ్రెసోళ్ల ఏనాడు పేదల గురించి ఆలోచించలే కేసీఆర్ ఇచ్చే పింఛన్లతో ముసలోళ్ళ ముఖం లో సంతోషం కనిపిస్తుంది మెదక్ జిల్లాకు 21 వేల కొత్త పెంచన్లు ఇవ్వబోతున్నాం పేదలు ఆత్మగౌరవంతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ కల మెదక్ లో కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కట్టాం పేద ఆడపిల్లలకు పెళ్లిళ్ల కోసం షాది ముబారక్,కల్యాణ లక్ష్మీ ద్వారా రూ లక్ష ఇస్తున్నాము కాంగ్రెసోళ్ల మాటలు చెబితే టిఆర్ఎస్ చేతలు చేస్తుంది.

బీజేపీ పార్టీ ఉచితాలు బంద్ చేయాలని అంటున్నారు.రద్దు చేయమన్న బీజేపీ ని రద్దు చేస్తాం బీజేపీ 10 లక్షల కోట్లు పెద్దలకు మాఫీ చేసింది సీఎం కేసీఆర్ పేదల కోసం ఖర్చుచేస్తున్నారు.

హిందు ,ముస్లిం కొట్లాట పెట్టాలని కొందరు చూస్తున్నారు.పేదలకు సాయం చేసే ప్రభుత్వం కావాలి కుల,మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు మనకొద్దుపెదలే మా బంధువులు కృష్ణ జలాల్లో మా వాటా తేల్చాలని దరఖాస్తు ఇస్తే ఇప్పటికి తేల్చలే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసింది బీజేపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు,నవోదయ విద్యాలయాలు అడిగితే కేంద్రం ఇవ్వలే పేదలకు సబ్సిడీ పై సిలిండర్ ఇవ్వని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం బాయికాడ మీటర్లు పెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుంది.

సీఎం కేసీఆర్ మోటారు మిటర్లను అడ్డుకుంటున్నాడు.డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద త్వరలో అన్ని వసతులు కల్పిస్తాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube