జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరుపై వైసీపీ మంత్రి సిదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు ప్యాకేజీకి ఆశపడి ఆయన చెప్పినట్లు తలాడిస్తున్నారని చెప్పారు.
జనసేన, టీడీపీ నేతలు కావాలనే ఉత్తరాంధ్రపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.టీడీపీ డైరెక్షన్ లోనే పవన్ సమావేశం పెట్టారన్నారు.
పవన్ కు యువశక్తి అని పేరు పెట్టారు.లోకేశ్ చేపట్టే పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారని తెలిపారు.
మత్స్యకారుల గురించి, వారు వలసలు ఎందుకు వెళ్లారో పవన్ కు ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.







