స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు - మంత్రి రోజా

విజయవాడ: మంత్రి ఆర్కే రోజా. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు.

 Minister Roja Shocking Comments On Nara Lokesh, Minister Roja , Nara Lokesh, Sk-TeluguStop.com

రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు.ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట.

లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారు.అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరు.

అందుకే మోడి, అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.చంద్రబాబు స్కిల్ డెవెలప్ మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాం లు చేసారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేష్ అడుగుతున్నారు.

రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ పేరుతో దోచుకున్నారు.ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేష్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారు.స్కాంలలో ఇరుక్కుని లోకేష్ ఢిల్లీ పారిపోయాడు.కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నాడు.

ఎర్రబుక్ లో రసుకుంటానని బెదిరిస్తున్న లోకేష్ సీఐడీ మెమోలో ఆయన పేరు రాసారని గుర్తు చేసుకోవాలి.హెరిటేజ్ లో 2శాతం షేర్లు అమ్మితెనే 400కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారు.

అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా.చంద్రబాబు అఫిడవిట్ లో ఆవిషయం స్పష్టం చేశారా.

కర్జూర నాయుడు చంద్రబాబుకు, ఆయన తమ్ముడికి చెరో ఎకరం ఇచ్చారు.అక్కడినుండి లక్షల కోట్లకు చంద్రబాబు ఆస్తి ఎలా పెరిగింది.హైదరాబాద్ లో చంద్రబాబు ఇల్లు 600 కోట్లు.భువనేశ్వరి లోకేష్ 118 కోట్ల అయితే నోటీసులకు సమాధానం చెప్పాలి.

ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాం లను తెల్సుకోవాలి.భువనేశ్వరి, బ్రహ్మణి అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతుంది.

చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ తెలుసు.చంద్రబాబు టీమ్ వర్క్ గా కుటుంబసభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube