అమరావతి, తాడేపల్లి: కేఎల్ యూనివర్శిటీలో యువజనోత్సవాల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి ఆర్కే రోజా. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొననున్న కళాకారులకు అభినందనలు.33 విభాగాల్లో 1000 మందికి పైగా విద్యార్ధులు పాల్గొన్నారు.ఇటీవల నెల రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం తరపున సాంస్కృతిక సంబరాలు నిర్వహించాం.కళాకారుల ప్రదర్శనలు చూసి చాలా సంతోషం కలిగింది.కనుమరుగైపోతున్న కళలను బ్రతికించేందుకు యువత నడుంబిగించడం ఆనందంగా ఉంది.సరైన వేదిక లేకపోవడం వల్ల చాలా మందిలో ట్యాలెంట్ బయటికి రాదు.
యువత యూత్ ఫెస్టివల్స్ లో పాల్గొనాలి.
ఒక వేదిక ఉంటే మనలో టాలెంట్ తెలుస్తుందనడానికి నేనే ఉదాహరణ.యూత్ ఫెస్టివల్ లో చూసే నన్ను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.స్వామి వివేకానంద మాటలను యువత ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
మందలో ఒకరిగా కాదు… వందలో ఒకరిలా విద్యార్ధులు నిలవాలి.నాకు సముద్ర కెరటం ఆదర్శం.ఎన్ని సార్లు కింద పడినా కెరటంలా లేచాను.ఈరోజు మంత్రిని అయ్యాను.సీఎం జగన్ మోహన్ రెడ్డి యూత్ ఐకాన్.యువత సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి.
ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు పరిస్థితులు వేరు.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినపుడు పరిస్థితులు వేరు.రకరకాల పార్టీలు, వ్యక్తులను తట్టుకుని నిలిచి ఈరోజు జగన్ సీఎం అయ్యారు.ప్రస్తుతం చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్యసు చేసుకుంటున్నారు.ఎవరూ లక్ష్యం లేకుండా ఉన్నత స్థాయికి చేరుకోలేరు.గొప్ప గొప్ప వాళ్లంతా ఒడిదుడుగులు ఎదుర్కొన్న తర్వాత సక్సెస్ అయ్యారు.
విద్యార్ధులంతా ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి.బెంగుళూరులో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో యువత ఏపీ పేరు నిలబెట్టాలి.
యువతకు ఈ ప్రభుత్వం, సీఎం జగన్ మోహన్ రెడ్డి, నేను ఎప్పుడూ అండగా ఉంటాం.