ఈ నెల 14న కరీంనగర్ లో మంత్రి పొన్నం దీక్ష..!!

కరీంనగర్ లో ఈ నెల 14వ తేదీన మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) దీక్ష చేపట్టనున్నారు.తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లుగా బీజేపీ అన్యాయం చేసిందంటూ పొన్నం దీక్ష చేయనున్నారని తెలుస్తోంది.

 Minister Ponnam Deeksha In Karimnagar On 14th Of This Month..!!,minister Ponnam-TeluguStop.com

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి ఇచ్చిన వారినే బీఆర్ఎస్( BRS ) ఓట్లు అడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఈ క్రమంలోనే ఒక్క వేలు తమపై చూపెడితే నాలుగు వేళ్లు మీ వైపు చూపిస్తామని చెప్పారు.

మిషన్ కాకతీయ నీళ్లు ఎటుపోయాయని ప్రశ్నించారు.తెలంగాణ ఏర్పాటుపై మోదీ( Narendra Modi ) అవహేళనగా మాట్లాడారన్న పొన్నం తెలంగాణ అమరులను సైతం మోదీ అవమానించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు మోదీకి ఎక్కడిదని నిలదీశారు.రాష్ట్రానికి బీజేపీ( BJP ) చేసిందేంటన్న మంత్రి పొన్నం రాముడి ఫొటో పక్కన మోదీ ఫొటో ఎలా పెడతారని ప్రశ్నించారు.

రాజకీయాల కోసం రాముడిని వాడుకోవడం తప్పని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube