2024 ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్( CM YS Jagan ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను నిత్యం ప్రజలలో ఉండే విధంగా ఏడాది నుంచి రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదే సమయంలో మరోపక్క రకరకాల సర్వేలు నిర్వహించడం జరిగింది.ఆ సర్వే ఫలితాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు.
ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత.క్యాడర్ లో వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెట్టేస్తున్నారు.
మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా “సిద్ధం”( Siddham Meeting ) సభలు నిర్వహిస్తున్నారు.ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మొదట భీమిలిలో నిర్వహించారు.
కోస్తా ప్రాంతానికి సంబంధించి దెందులూరులో రెండో సభ నిర్వహించారు.ఈ రెండు సభలకు భారీ ఎత్తున జనం రావడం జరిగింది.
కాగా ఈనెల 11వ తారీకు రాయలసీమ ప్రాంతంలో నిర్వహించాలని అనంతపురం జిల్లా “రాప్తాడు” ( Raptadu Siddham Meeting )లో మూడవ సిద్ధం సభ ఆలోచన చేశారు.కానీ ఈనెల 11న జరగాల్సిన సిద్ధం సభ 18కి వాయిదా వేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) స్పష్టం చేశారు.ఈనెల 18వ తారీకు “సిద్ధం” సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలకు చంద్రబాబు పొత్తుల కోసం తహతలాడుతున్నారు.ఎంత మందితో కలిసి వచ్చిన వైసీపీదే విజయం.వాలంటీర్ల పై ఎల్లో మీడియా( Yellow Media ) దుష్ప్రచారం చేస్తోంది.
కరోనా లాంటి కష్టకాలంలో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిది అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.