YCP Siddham : ఈనెల 11న జరగాల్సిన “సిద్ధం” సభ వాయిదా.. ప్రకటన చేసిన మంత్రి పెద్దిరెడ్డి..!!

2024 ఎన్నికలను వైసీపీ అధినేత సీఎం జగన్( CM YS Jagan ) చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను నిత్యం ప్రజలలో ఉండే విధంగా ఏడాది నుంచి రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు.

ఇదే సమయంలో మరోపక్క రకరకాల సర్వేలు నిర్వహించడం జరిగింది.ఆ సర్వే ఫలితాలు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు.

ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకత.క్యాడర్ లో వ్యతిరేకత ఉన్న వారిని పక్కన పెట్టేస్తున్నారు.

మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా "సిద్ధం"( Siddham Meeting ) సభలు నిర్వహిస్తున్నారు.ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి మొదట భీమిలిలో నిర్వహించారు.

కోస్తా ప్రాంతానికి సంబంధించి దెందులూరులో రెండో సభ నిర్వహించారు.ఈ రెండు సభలకు భారీ ఎత్తున జనం రావడం జరిగింది.

"""/"/ కాగా ఈనెల 11వ తారీకు రాయలసీమ ప్రాంతంలో నిర్వహించాలని అనంతపురం జిల్లా "రాప్తాడు" ( Raptadu Siddham Meeting )లో మూడవ సిద్ధం సభ ఆలోచన చేశారు.

కానీ ఈనెల 11న జరగాల్సిన సిద్ధం సభ 18కి వాయిదా వేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) స్పష్టం చేశారు.

ఈనెల 18వ తారీకు "సిద్ధం" సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.వచ్చే ఎన్నికలకు చంద్రబాబు పొత్తుల కోసం తహతలాడుతున్నారు.

ఎంత మందితో కలిసి వచ్చిన వైసీపీదే విజయం.వాలంటీర్ల పై ఎల్లో మీడియా( Yellow Media ) దుష్ప్రచారం చేస్తోంది.

కరోనా లాంటి కష్టకాలంలో వాలంటీర్లు చేసిన సేవ మరువలేనిది అని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన సైకిల్.. చూస్తే అవాక్కవుతారు…