బోయిన్‌పల్లి మైదానంలో జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన షమీ పూజకు హాజరైన మంత్రి మల్లారెడ్డి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.తాను పాలు అమ్మిన స్కూటర్ అక్కడ కనబడడంతో ఒక్కసారిగా మంత్రి హుషారుగా స్కూటర్ ను తోలుతూ సందడి చేశారు.
బోయిన్‌పల్లి లో పాల వ్యాపారం చేసే రోజులలో అదే స్కూటర్ పై తిరుగుతూ పాలు అమ్మినట్లు మంత్రి తెలిపారు.బోయిన్‌పల్లి మైదానంలో స్కూటర్ పై చక్కర్లు కొడుతూ అందరిని అలరించారు.
మంత్రి మల్లారెడ్డి స్కూటర్ నడుపుతూ మరోసారి వార్తల్లో నిలిచారు.