కమెడియన్ వేణు(Venu) దర్శకుడిగా మారి ప్రియదర్శి(Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్(Kavya Kalyan Ram) జంటగా దిల్ రాజు(Dil Raju) కూతురు హన్షిత రెడ్డి(Hanshitha Reddy) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా బలగం(Balagam) .చిన్న సినిమాగా రిలీజయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని ఎన్నో అవార్డులను అందుకున్నటువంటి ఈ సినిమా గురించి తాజాగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావనకు తీసుకోవచ్చారు.
ప్రస్తుతం తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ(Assembly) సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలలో భాగంగా మంత్రి కేటీఆర్ ( KTR ) పల్లెల అభివృద్ధి గురించి మాట్లాడుతూ అసెంబ్లీలో బలగం సినిమా ప్రస్తావనకు తీసుకువచ్చారు.

మరి అసెంబ్లీలో బలగం సినిమా గురించి మంత్రి కేటీఆర్ ఏమని మాట్లాడారు ఏంటి అనే విషయానికి వస్తే.ఒకప్పుడు సినిమాలలో కరువు లేదా కటిక నేలల్లో షూట్ చేయాల్సి వస్తే కనుక రాయలసీమ తెలంగాణ ప్రాంతాలలో మాత్రమే సినిమాలు చేసేవారు.అయితే ఇప్పుడు పచ్చని పొలాలు పల్లెటూరు అందాలను చూపించాలి అంటే తెలంగాణను వెతుక్కుంటూ చిత్ర బృందం వస్తున్నారని మంత్రి తెలిపారు.మా సిరిసిల్ల బిడ్డ వేణు ఎల్దండి బలగం అనే సినిమా తీశాడు.
సినిమా ప్రమోషన్స్ కి నన్ను పిలిచాడు.సిరిసిల్లలో ఫంక్షన్ పెట్టు అని చెప్పాను.
ఈ సినిమాలో అనుబంధాలను ఎంతో గొప్పగా చూపించారు.

ఈ సినిమాలో మానవ బంధాలతో పాటు పల్లె అందాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఆ సినిమా షూటింగ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలో( Konaraopeta ) జరిగింది. ఈ సినిమా నేను నా కుటుంబంతో కలిసి చూసాను.
అయితే ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా షూటింగ్ నిజంగానే తెలంగాణలో తీశారా అని నన్ను చాలామంది అడిగారు.ఒకప్పుడు కరువు నేలగా ఉన్నటువంటి తెలంగాణ మొత్తం కోనసీమలుగా మారిపోయాయి అంటూ ఈ సందర్భంగా బలగం సినిమాని ఉదాహరణగా తీసుకుంటూ తెలంగాణ అభివృద్ధి గురించి మంత్రి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







