కేటీఆర్ మనసు దోచుకున్న చిన్న పిల్లల డ్యాన్స్... 'అద్భుతం' అంటూ కితాబు!

ఎల్లప్పుడూ రాజకీయాలలో సీరియస్ గా తనామునకలైనటువంటి KTR అప్పుడప్పుడు కాస్త సాంత్వన కోసం సోషల్ మీడియాలలో కాస్త యాక్టివ్ అవుతారు.

ఈ క్రమంలో తనకు నచ్చినటువంటి కొన్ని వీడియోలను షేర్ చేస్తూ వుంటారు.

కేటీర్ మంచి కళాపిపాసి అన్న సంగతి అందరికీ తెలిసినదే.ఈమధ్య కాలంలో అతను అనేక ఆడియో ఫంక్షన్స్ కి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి ముఖ్య అతిధిగా వెళ్లిన దాఖలాలని మనం అనేకం చూసాం.

కళాకారులని ప్రోత్సాహ పరచడంలో అతను ఎప్పుడు ముందుంటారు.ఈ క్రమంలోనే అతను ఓ డాన్స్ వీడియోకి ఫిదా అయ్యారు.

దాంతో అతను తన ట్విట్టర్ వేదికగా దాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.అలా అతను పోస్ట్ చేసిన వీడియో ఇపుడు ట్విటర్​లో వైరల్ అవుతుంది.

Advertisement

ఆ వీడియోని అతను షేర్ చేస్తూ.సదరు వీడియో చూస్తే కచ్చితంగా మీ ముఖాల్లో చిరునవ్వు ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పుకొచ్చారు.

పిల్లలు అద్భుతమైన డ్యాన్సర్లు అంటూ ప్రశంసించారు.ఇక సదరు వీడియోలో.

ఉన్నవాళ్ళంతా విదేశీ పిల్లలు అయినప్పటికీ వాళ్లు స్టెప్పులేసింది మాత్రం ఓ బాలీవుడ్​ పాటకు మరి.ఈ మధ్య యూట్యూబ్​ షాట్స్​, ఇన్​స్టా రీల్స్, పెళ్లిల్లు, సంగీత్​లు ఇలా​ ఎక్కడ చూసినా.క్రికెటర్ల నుంచి సామాన్యుల దాకా ఇదే పాటకు స్టెప్పులేస్తున్నారు.

ఆ పాట మరేదో కాదండీ బాలీవుడ్​ బ్యూటీ కత్రినా కైఫ్​ స్టెప్పులతో ఉర్రూతలూగించిన "కాలా చష్మా" అనే పాట.అవును.ఆ పాటకు స్నేహితులంతా ఓ చోట చేరి తమదైన శైలిలో డ్యాన్స్​ చేస్తూ.

తమిళ హీరోలకు వచ్చినన్ని అవార్డ్ లు తెలుగు వారికి ఎందుకు రాలేదు ?
రియల్ హీరోకి 100 అడుగుల అభిమానాన్ని చాటుకున్న వీరాభిమాని..

ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలల్లో పోస్ట్ చేసారు.కాగా వీరు నైజీరియన్​ పిల్లలు అని తెలుస్తోంది.

Advertisement

వారి స్టెప్పులకు ఫిదా అయిన కేటీఆర్​.ఆ వీడియోను ట్విటర్​ వేదికగా పంచుకున్నారు.దాంతో ఇది డబల్ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు