బీజేపీపై తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దేశంలో ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం కారణంగానే బీజేపీకి ప్రజలు ఓటు వేస్తున్నారన్నారు.
బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ఆయన పాక్, చైనా బోర్డర్ల పేర్లు చెప్పుకుని పార్టీ బతికేస్తుందని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ పార్టీని చూసి బీజేపీ భయం పట్టుకుందని విమర్శించారు.
బీఆర్ఎస్ అవసరం దేశానికో ఎంతో ఉందని చెప్పారు.బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన అసలు సిగ్గుందా అంటూ విరుచుకుపడ్డారు.
బీజేపీ అంతానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని మంత్రి కొప్పుల స్పష్టం చేశారు.







