Karumuri Nageswara Rao : జన్మభూమి కమిటీలు అంటూ టీడీపీ పై మంత్రి కారుమూరి సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడే కొలది రాజకీయం రసవతారంగా మారుతుంది.2024 ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఎట్టి పరిస్థితులలో విజయం సాధించాలని గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జనసేన, బీజేపీ( Janasena , BJP ) పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.

 Minister Karumuri Serious Comments On Tdp-TeluguStop.com

దీంతో ఎన్నికల దగ్గర పడుతుండటంతో ఎవరికివారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇదే సమయంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

తాజాగా వైసీపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరా( karumuri nageswara rao )వు టీడీపీ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో పందికొక్కుల్లా దోచుకుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు.సోమవారం అత్తిలి పట్టణంలో పలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy ) హయాంలో సచివాలయ వ్యవస్థతో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని స్పష్టం చేశారు.

మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని అన్నారు.ఇదే ప్రజలు కోరుకుంటున్నారు.జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయాలు మతాలు కులాలు చూడకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది.గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు చేసినట్టు చేయకుండా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మేలు చేశారు.

కాబట్టి ప్రజలు మరొకసారి జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు మంత్రి కారుమూరి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube