రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు - మంత్రి కారుమూరి నాగేశ్వరావు

ఏలూరు: కారుమూరి నాగేశ్వరావు పౌరసరఫరాల శాఖ మంత్రి కామెంట్స్.అకాల వర్షాలకు నష్టం లేకుండా సీఎం జగన్ అదేశాలుతో అధికారులను అప్రమత్తం చేసి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.

 Minister Karumuri Nageswara Rao Fires On Chandrababu Naidu, Minister Karumuri Na-TeluguStop.com

చంద్రబాబు లెగ్ మహిమతో అధికారంలో ఉండగా వర్షాలు లేవు.నిన్న అడుగు పెట్టగానే గంటన్నర వర్షం కురిసింది.

చంద్రబాబు పార్టీకి చెందిన నాయకులు,కార్యకర్తలే ఉన్నారు,దళారులే రైతులుగా చేసి మాట్లాడించాడు.మా ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుంది.

చంద్రబాబు దూర్మార్గుడు,టీడీపీ నాయకులే సీఎం జగన్ నిర్ణయాలు మెచ్చుకుంటున్నారు.ఈరోజు మేము ఆన్ లైన్, ఆఫ్ లైన్ లోకూడా ధాన్యం తీసుకున్నాం.

2కోట్ల 10లక్షలు జిల్లాలో ధాన్యం డబ్బులు జామచేసాం.2014లో ఇన్ఫ్యూట్ సబ్సిడీ నువ్వు ఇవ్వకపోతే మేము అధికారంలోకి రాగానే ఇచ్చాము.రైతుకు వ్యవసాయం దండగ అన్నావ్, సివిల్ సప్లయ్ వ్యవస్థను నాశనం చేసి 4999కోట్లు పసుపు కుంకుమ కింద తగలేసావ్.నువ్వు ముసలి నక్కవి నువ్వు, దోచుకొ, దాచుకో అన్నట్లుగా ఉన్నావ్.

నీ మనుషులను పెట్టి రైతులగా మాట్లాడించావ్.మూడు సార్లు ముఖ్యమంత్రి చేసావ్ రోజు మీటింగలు పెట్టావ్, ఏమి న్యాయం చేసావ్.

నీరు, మొక్క, చెట్టు, పుట్టా అంటూ నువ్వు, ని కొడుకు దోచుకున్నారు.

నువ్వు జైలుకు వెళ్ళటం ఖాయం.

స్టే లు తెచ్చుకుని తప్పించుకుంటున్నవ్.మళ్ళీ జగనే కావాలి, రావాలి అని కోరుకుంటున్నారు.

రైతులకు అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు.రైతులకు అండగా నిలిచినా ఒకే ఒక వ్యక్తి సీఎం జగన్.1530రూపాయలు రేటు రైతుకు అందిస్తున్నాం.రాష్ట్రంలో సీఎం జగన్ అందరికి న్యాయం చేస్తున్నారు.

కరోనా టైం లో నువ్వు, నీ కొడుకు అద్దాల మేడలో దాకున్నారు.నిన్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు, నక్క జిత్తుల వ్యవహారం వద్దు నిజాలు మాట్లాడాలి.

నిన్ను నమ్మం బాబూ అని ప్రజలు చెప్పారు, నిన్ను నమ్మే స్థితిలో కూడా ప్రజలు లేరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube