అమరావతి: పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.చంద్రబాబు నాయుడు పొత్తుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం గా ఉంది.
పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో వెళ్లలేరు.పొత్తుల తోనే ఆయన రాజకీయ జీవితం నడుస్తుంది.
అందరినీ కలుపుకుని ప్రజలపై ఉద్యమం చేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు.జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు.
సీఎం జగన్ పక్షపాతం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తున్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలను దూరం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ప్రజలకు ద్రోహం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ జనసేన సహా ఎంతమంది ఎవరితో కలసి రావచ్చు.
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ సింగిల్ గా సింహం లాగా పోటీ చేస్తారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు మూడు సీట్లకు పరిమితం అవుతారు.
గాదె కింద పందికొక్కుల్లా గతంలో చంద్రబాబు దోచుకున్నారు.సీఎం జగన్ ను దింపేసి ఎలా దోచుకోవాలా అని చంద్రబాబు చూస్తున్నారు.ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో పన్నులు తక్కువగా ఉన్నాయి.