బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుకు( Former Minister Harish Rao ) మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.రాష్ట్రంలోని రైతుల గురించి చర్చించడానికి సిద్ధమా అని హరీశ్ రావుకు ఛాలెంజ్ చేశారు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎప్పుడైనా పంట నష్టం ఇచ్చిందా అని జూపల్లి ప్రశ్నించారు.త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో లబ్ధి పొందడం కోసమే హరీశ్ రావు అబద్దాలు చెప్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్( BRS ) ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సుమారు ఆరు వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని మంత్రి జూపల్లి తెలిపారు.రాయలసీమకు నీళ్లు తరలిస్తుంటే గుడ్లు అప్పగించి చూశారని విమర్శించారు.