కృష్ణాజిల్లా నియోజవర్గం ఉయ్యూరు మండలంలో మంత్రి జోగు రమేష్( Minister Jogu Ramesh ) పలు సచివాలయాలు రోడ్లకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు.చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేక మోడీ కాళ్లు పట్టుకున్నారని తెలిపారు.2014 ఎన్నికలు లాగా ఇప్పుడు మళ్లీ టిడిపి జనసేన బిజెపి గుంపులుగా కలిసి వస్తున్నాయని చంద్రబాబు నాయుడు 2014లో రైతులకు రుణమాఫీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాను హామీ ఇచ్చి చేతులు ఎత్తేసాడని ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు
తాజా వార్తలు