చంద్రబాబు కుప్పం పర్యటన ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేసింది.చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో పాటు ర్యాలీకి మరియు సభకు అనుమతులు లేదని తెలియజేశారు.
దీంతో తనని అడ్డుకున్న పోలీసులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.తన నియోజకవర్గంలో పర్యటించడానికి ఎవరు అనుమతి కావాలని ప్రభుత్వం పై మండిపడ్డారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు పోలీసులకు మధ్య తోపులాట కూడా జరిగింది.దీంతో చంద్రబాబు పర్యటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో మంత్రి జోగి రమేష్…చంద్రబాబుపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఆయన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.అమాయకుల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నట్లు విమర్శలు చేశారు.కావాలని పోలీసులపై చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.
ప్రజల భద్రత కోసమే ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగిందని స్పష్టం చేశారు.జీవో చదవకుండా కుప్పం వెళ్లి చెత్త వాగుడు వాగుతావా.? అని ప్రశ్నించారు.కుప్పంలో చంద్రబాబుకి ఓటు హక్కు లేదని మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.