ప్రముఖ రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashant Kishor )చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. సీఎం వైయస్ జగన్ ( CM YS Jagan )ని టార్గెట్ చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సంక్షేమ పథకాలు అందించిన అంతమాత్రాన ఓట్లు పడవని, ప్రజలు అభివృద్ధిని కూడా చూస్తారని వ్యాఖ్యలు చేశారు.జగన్ ఈ విషయంలో పెద్ద తప్పు చేశారని ఆయన చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణం అవుతాయి అంటూ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ( YCP )కి చెందిన నాయకులు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇస్తున్నారు.తాజాగా మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.
ఒక పీకే అయిపోయాడు అనుకుంటే ఇప్పుడు మరో పీకే వచ్చాడని ఎద్దేవా చేశారు.ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదని ఎద్దేవ చేశారు.

ఏపీలో ప్రశాంత్ కిషోర్ కి టీమ్ ఉందా.? అతను సర్వేలు ఎప్పుడు చేశాడు.? అని ప్రశ్నించారు.ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు.
ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది.? ప్రశాంత్ కిషోర్ నీ ఎవరు పట్టించుకోరు. టీడీపీ( TDP ) రాసి ఇచ్చిన స్క్రిప్ట్ నే చదువుతున్నారు అంటూ విమర్శలు చేశారు.చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారు.ఎంతమంది పీకేలు వచ్చినా చంద్రబాబు( Chandrababu ) వచ్చిన జగన్ గెలుపును ఎవరు ఆపలేరు.మరోసారి జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని మంత్రి జోగి రమేష్( Minister Jogi Ramesh ) స్పష్టం చేశారు.
ఎంతమంది పీకేలు వచ్చినా.జగన్ లోకల్.
తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ప్రశాంత్ కిషోర్ అంచనాలు తప్పాయి.ఎన్నికలలో ఓటమిపాలైన తర్వాత చంద్రబాబు, పవన్ ఏపీని వదిలేసి పారిపోతారు అంటూ మంత్రి జోగి రమేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.