టీడీపీపై మంత్రి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వంపై కావాలనే కొందరు పని గట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలంటూ మరో కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని తెలిపారు.రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని మంత్రి స్పష్టం చేశారు.
సచ్చిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు.ఇళ్ల నిర్మాణంపైనా కూడా టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
ఏపీ వ్యాప్తంగా శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.ఇందులో భాగంగానే సీఎం జగన్ 30 లక్షల ఇళ్లు కట్టిస్తున్నారని తెలిపారు.
మార్చి 24 లోపు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామని చెప్పారు.