ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదివారని విమర్శించారు.
ఏపీ గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ ఏం తెలుసు అని ప్రశ్నించారు.విమర్శలు చేసే ముందు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి తెలుసుకోవాలని సూచించారు.మూడున్నరేళ్ల పాలనలో రెండున్నర లక్షల మంది యువతకి రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.90 వేల మందికి ఔట్ సోర్సింగ్ ద్వారా కల్పించామని వెల్లడించారు.
యువతకు ఉద్యోగాలు లేవన్న అంశంపై చర్చకు వస్తారా.? అని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా రెండు లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు.అనంతరం రాష్ట్రంలో అడుగు పెట్టే అర్హత ఉందా అని అడిగారు.
ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం పూర్తి చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు.రాష్ట్రంలో మతతత్వ చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్న మంత్రి.
ఏం చూసి బీజేపీకి ఓటు వేయాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.







