మంత్రులు దద్దమ్మలు కాబట్టే కరువు..: జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పాలన అగమ్యగోచరంగా తయారైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి( BRS Leader Jagadish Reddy ) అన్నారు.పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆగమయ్యారని తెలిపారు.

 Minister Jagadish Reddy About Congress Govt,minister Jagadish Reddy ,congress Go-TeluguStop.com

కాంగ్రెస్ హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని జగదీశ్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్ నేతలు ఓట్లు దండుకొని ఇప్పుడు మొఖం చాటేశారని విమర్శించారు.

రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నా చలనం లేదని తెలిపారు.నాగార్జునసాగర్ కింద నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని ఆరోపించారు.

మన కళ్ల ముందే పాలేరుకు నీళ్లు తరలిపోయాయని మండిపడ్డారు.జేబు దొంగలా సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతున్నారన్న జగదీశ్ రెడ్డి మంత్రులు దద్దమ్మలు కాబట్టే కరవు వచ్చిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube