వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం బాధాకరమని మంత్రి హరీష్ రావు అన్నారు.ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ చేపడుతుందని స్పష్టం చేశారు.
ప్రీతి కేసులో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.ఇదే సమయంలో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ప్రీతి కుటుంబానికి అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ప్రీతి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని అన్నారు.
తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు అదే సమయంలో నిరంతరం ఆమె ఆరోగ్యం విషయంలో వైద్యులతో సంప్రదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే ఈ ఘటనలో.మొదటి నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ పై ఎస్సీ.ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు.పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వరంగల్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ తెలియజేయడం జరిగింది.హైదరాబాదు నిమ్స్ ఆస్పత్రిలో.
గవర్నర్ తమిళిసై.కూడా ప్రీతి ఆరోగ్యం గురించి వైద్యుల వద్ద సంప్రదింపులు చేసి.
ఆమె తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.